వాస్తు: పూజ గది విషయంలో ఈ తప్పులు చెయ్యద్దు..!

పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తు ప్రకారం ఫాలో అయితే కచ్చితంగా సమస్యలేమీ ఉండకుండా ఆనందంగా జీవించడం.

అలాగే వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ రోజు మనం మన ఇంట్లో ఉండే పూజ గది గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే పూజ గది ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపు ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా పూర్తిగా మందిరం కట్టుకునేటప్పుడు ఈ విషయాన్ని మరిచిపోకండి. చాలా మంది తెలియక నచ్చిన దిక్కుల్లో పూజ గదిని నిర్మిస్తారు. అలా చేయడం తప్పు కనుక ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపు పూజ గదిని పెట్టుకోవడం మంచిది.

అలాగే పూజ గదిని నిర్మించేటప్పుడు రాయికి బదులుగా చెక్కని వాడితే మంచిది. అయితే చెక్కతో చేసే ఆ మందిరం గోడకి కాస్త దూరంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా పూజ గదిని నిర్మించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు. పండితులు చెప్పిన విధంగా అనుసరించారు అంటే కచ్చితంగా మేలు జరుగుతుంది అని గమనించండి. అదే విధంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.