రోజురోజుకు పెరుగుతున్న కాణిపాకం వరసిద్ది వినాయకుడి రహస్యం తెలుసా?

-

తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్న తర్వాత ఎక్కువ మంది కాణిపాకం వరసిద్ది వినాయకుడిని దర్శించుకుంటారు..ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు.మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో  ఇప్పుడు తెలుసుకుందాం..

హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది..

ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ చాలెంజ్ చేస్తారు.

కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా వుంటుంది. కానీ కాణిపాకం గుడి వున్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయభూమి..అయితే ఆ పొలంలో నీరు తగ్గి పోవడంతో బావిని ఇంకాస్త లోతుగా తవ్వారు. అప్పుడే ఎదో రాయి అడ్డుపడింది.గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం వూరటం మొదలైంది. కొద్దికొద్దిగా బావి నిండుతుంది.

వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్థులకు తెలిసి పూజించటం మొదలెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకింది…అలా ఆ స్థలాలనికి ఆ పేరు వచ్చింది.ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజురోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయట పడిన బావిలోనే వుంది.ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కి.మీ ల దూరంలో వుంది.అక్కడ ఉన్న స్వామివారికి మనకు ఇష్టమైన పదార్థాన్ని వదిలి వేస్తానని కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం.

అక్కడకు ఎలా చేరుకోవాలి..

తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు లభించును..ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరులకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు…

Read more RELATED
Recommended to you

Latest news