ఆషాఢమాసం ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

-

ఆషాఢమాసం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..అందరికి తెలుసు..కొత్త దంపతులు, అత్త అళ్లుల్లు, అత్త కోడళ్లకే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాశస్త్యం ఉంది. ఆషాడమాసం ఎన్నో పర్వదినాలను తీసుకువస్తుంది.పూర్వాషాడ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఆషాడమాసం అంటారు. ఆధ్యాత్మికపరంగా చూసినట్లయితే ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది.

ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకుంటారు. ఆషాడమాసంలో తెలంగాణలో బోనాలు సంబరాలు కూడా మొదలవుతాయి..సూర్య భగవానుడు ఆషాడంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి దక్షిణాయానం ప్రారంభం అవుతుంది. పూరీక్షేత్రంలో ఆషాడశుద్ధ పాడ్యమినాడు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. ఈ మాసంలోనే స్కందపంచమి, సుబ్రమణ్యషష్టి వస్తుంది. తొలిఏకాదశి పర్వదినం కూడా వస్తుంది. మహాభారతాన్ని రచించిన వ్యాసభగవానుడిని ఆరాధించే రోజే ఆషాఢపౌర్ణమి దీన్నే గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు.

ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు మొదలు అవుతాయి.. తొలిఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు.దాన్ని తొలిఏకాదశిగా భక్తితో దీక్ష చేపడతుంటారు. ఎంతో విశష్టత కలిగిన సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ మాసాన్ని ఆషాడమాసం అంటారు..ఈ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది..పెళ్లిళ్లకు బెస్ట్..వ్రతాలు పూజలు కూడా ఎక్కువగా చేస్తారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version