హిందువులు వారి ఇళ్ళల్లో దేవుడికి సంబంధించిన చిత్ర పటాలను ఉంచుతారు.అందరి దేవుళ్ళను పూజిస్తారు..తమకు ఇష్టమైన దైవం ఫొటోలను గోడలకు వేలాడదీస్తుంటారు. లేదంటే పూజగదిలో ఉంచుతారు.ఆంజనేయస్వామి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావని పండితులు అంటున్నారు.హనమాన్ ను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాదు…ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతుంటారు. అందుకే హిందువుల్లో చాలామంది తమ ఇంట్లో హనుమాన్ ఫొటోను ఉంచుతారు.
అయితే, వాస్తు ప్రకారం హనుమాన్ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. అశ్రద్ధ చేస్తే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని ఇబ్బుందులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. హనుమంతుడికి సంబంధించిన ఎన్నో రకాల ఫొటోలు మనం చూస్తూంటాం. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని ఎత్తుకెళ్లే ఫొటో , రామలక్ష్మణుడిని తన భుజాలపై తీసుకెళ్తున్న ఫొటో, ఛాతిని చూపిస్తున్న ఫొటోలు ఇలా ఎక్కువగా కనిపిస్తాయి.అయితే వాస్తు నిపుణుల సలహా ప్రకారం…హనుమంతుడికి సంబంధించిన కొన్ని ఫొటోలనే ఇంట్లోనే ఉంచుకోవాలని అంటున్నారు. గాల్లో ఎగురుతున్న లేదా పర్వతాన్ని ఎత్తే చిత్రాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదని నమ్ముతుంటారు. ఈ ఫొటో ఇంట్లో ఉంటే అశుభమట..ఒక్క ఆంజనేయస్వామి ఉండే ఫోటోలను మాత్రమే ఉంచుకోవాలి.
ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి..
వాస్తుప్రకారం పసుపు దుస్తులు ధరించిన హనుమంతుడి చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందట. పసుపు, సింధూరమంటే హనుమాన్ కు ఎంతో ఇష్టమని హిందువులు విశ్వసిస్తారు.
హనుమాన్ కూర్చున్న భంగిమలో ఉన్న ఫొటోలు కూడా ఇంట్లో ఉంటే మంచివట. ఇలాంటి ఫొటోలు ఇంట్లో ఉంచితే సానుకూల వాతావరణం కల్పిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు..అలాంటి ఫోటోను పెట్టుకోవడం మంచిది..