కలలో ఇలాంటివి కనిపిస్తే ఏమౌతుందో తెలుసా?

-

మనుషులకు నిద్రలోకి జారుకోగానే చాలా మందికి కలలు రావడం సహజం..కొన్ని కలలు భయంకరంగా ఉంటాయి. మరికొన్ని సరదాగా ఉంటాయి. అయితే కొన్ని కలలు తెల్లావారిన తర్వాత కూడా గుర్తుంటాయి.కలలు వచ్చినప్పుడు కొన్ని పదే పదే వస్తే ఏదైనా చెడు జరుగుతుందేమో అని చాలా మంది భయపడతారు.అయితే మన కలలో 4 జంతువులు కనిపిస్తే లక్ ఉంటుందని డ్రీమ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ జంతువులు ఏవో? అవి కలలోకి వస్తే జరుగుతుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

గుడ్లగూబ: 

గుడ్లగూబ కలలోనే కాదు నిజంగా కనిపించినా అపశకునం అంటారు. గుడ్లగూబ అరుపు విన్నా ఏదో చెడు జరగబోతుందని ఆందోళన చెందుతారు. కానీ గుడ్లగూబ లక్ష్మీ దేవికి వాహనం. కాబట్టి గుడ్లగూబ కలలో కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ధనధాన్యం చేతికి వస్తుందని అంటారు పండితులు..మనకు అనుకోని లాభాలు వచ్చి పడతాయని అన్నారు.

ఏనుగు: 

కలలో మీకు ఏనుగు కానీ దర్శనమిస్తే మీ దశ తిరింగిందని అర్థం. ఏదో రూపంలో మీకు ధనం వస్తున్నట్టు సంకేతం. త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని అర్థం..ఎనుగును ప్రతి సారి చూస్తే పట్టిందల్లా బంగారం అని అంటున్నారు.

ఆవు:

కలల ఆధారంగా మంచి, చెడులు అంచనా వేస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం, ఆవు కలలో కనిపిస్తే, ఆ వ్యక్తికి దేవుడిపై భక్తి ఉన్నట్లే. ఆ వ్యక్తి దేని గురించి ఆలోచించనవసరం లేదు. ఆవు కనిపించిందంటే ఆ సమయంలో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని అర్థం..ఆవు మహా విష్ణువు అవతారం. అందుకే ఆవులు అన్నిటికీ శ్రేయస్కరం అని అంటున్నారు.

పాములు: 

చాలా మంది పాములు కలలో కనిపిస్తే ఆందోళనకు గురవుతారు. ఎందుకు ఇలా వచ్చింది, ఏదైనా అపశకునం జరుగుతుందేమో అని భయపడతారు. అయితే కలలో పాము కనిపించడం మంచి శకునమేనని నిపుణులు చెబుతున్నారు. కలలో పాము కనిపిస్తే మీరు సురక్షితంగా ఉంటారు. అంతే కాదు జీవితంలో విజయం సాధిస్తారని అర్ధమట.

మనకు వచ్చే ప్రతీ కలకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. మన ఆలోచనలు, నిర్ణయాలను బట్టీ కలలు వస్తుంటాయి. అయితే మన కలలో 4 జంతువులు కనిపిస్తే లక్ ఉంటుందని డ్రీమ్ నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news