కాముని పున్నమి రోజు ఆ స్వీట్ ను తింటే ఎమౌతుందో తెలుసా?

-

భారత దేశంలో హిందూ సాంప్రదాయలలో పండగలు, పర్వదినాలు జరుపుకునే విధానం ఆయా సీజనల్ కు అనుగుణంగా ఉంటుంది. హిందువుల పండగలు జరుపుకునే నియమాల్లో శాస్త్రీయ పద్ధతులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.నేడు శరత్ పూర్ణిమ.. ఆశ్వీయుజ మాసంలోని వచ్చే పూర్ణమిని శరత్ పూర్ణిమ లేదా కాముని పున్నమి అని అంటారు. అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్న సమయంలో ఈరోజు లక్ష్మీదేవి జన్మించిందని పురాణాల కథనం. అందుకనే ఈరోజు అమ్మవారి ఆరాధనకు విశేషమైన రోజుగా పరిగణిస్తారు. ముఖ్యంగా సాధారణ ప్రజలు.. అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తారు.

అయితే దేవీ ఉపాసకులు మాత్రం దుర్గాదేవిని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఇక ఈరోజు చంద్రుడిని కూడా విశేషంగా పూజిస్తారు.లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడు శరత్ పూర్ణిమ నాడు మాత్రమే 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజిస్తారు. ఈరోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని నమ్మకం. అందుకనే నేడు పున్నమి వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది.

వెన్నెలలో పెట్టిన పరమాన్నం చంద్రకిరణాల్లో ఉన్న ఔషధాలను తనలో ఉంచుతుందని అందుకే తర్వాత రోజు కుటుంబం మొత్తం ఆ పరమాన్నంను ప్రసాదంగా స్వీకరిస్తారు.విష్ణువు అవతారాల్లో ఒకరైన కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకనే బృందావనంలో ఈ శరత్ పూర్ణిమను రాస పూర్ణిమ అంటారు. ఈ రోజే శ్రీ కృష్ణుడు మహారాసలీల సలిపాడట. కృష్నుడి వేణుగానం విన్న కొన్ని వేల మంది గోపికలు.. అనీ వదిలేసి కన్నయ్య కోసం ఈ పున్నమి రోజున నాట్యం చేసారని పురాణాల కథనం. ఈరోజు మధుర, బృందావనంలో విశేష పూజలను చేస్తారు..సకల దరిద్రాలు పోయి మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం..

Read more RELATED
Recommended to you

Latest news