వెండి కుందులలో దీపారాధన చేస్తే ఏమవుతుందో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

ప్రతీ రోజు దీపారాధన చేస్తూనే ఉంటాం. దేవుడి దగ్గర, తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేస్తుంటాం. అయితే ఈ దీపారాధన చేయడానికి కొంత మంది మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు. మరి కొందరు అయితే కంచు, ఇత్తడి కుందులలో దీపారాధన చేస్తారు. ఇంకొంత మంది అయితే వెండి దీపాల తో వెలిగిస్తారు. ఇలా ఎవరి స్తోమతని బట్టి, వీలుని బట్టి దీపారాధన చేస్తారు. అయితే వెండి తో చేసిన కుందుల లో దీపాలు పెట్టడం వల్ల కలిగే పుణ్యం ఏమిటనేది ఇప్పుడే తెలుసుకోండి.

వెండి దీపాలను ఏ దేవుడి ముందు వెలిగించాలి అనే విషయానికి వస్తే… వెండి ప్రమిద లో నెయ్యిని వేసి వినాయకుడు ముందు దీపారాధన కనుక చేసారంటే…? మీరు అనుకున్న పనుల లో ఏ ఆటంకం రాదు. అలానే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు. అలానే వెండి ప్రమిద లో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే.. జ్ఞానం ప్రసాదిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

అంతే కాదండి ఏలినాటి శని ఉన్నవాళ్లు శనివారం వెండి ప్రమిద లో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది.
మంగళవారం కుజ గ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. బుధవారం నాడు బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగిస్తే… మంచి బుద్ధి కలుగుతుంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...