వ్యాక్సిన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన పాలసీ ప్రకారమే ఎంపీలు నడచుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపేర్కొన్నారు. కోవిడ్-19 కథ ఇంకా ముగిసిపోలేడన్న ఆయన ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసే సిబ్బంది, డ్రైవర్లు అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు సీటింగ్ ఏర్పాట్లు చేశామన్న ఆన ఇకపై పార్లమెంట్ క్యాంటీన్‌ను ఐటీడీసీ నిర్వహిస్తుందని దీంతో క్యాంటీన్ సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేస్తున్నామని ఆయన ప్రకటించారు.
అంతే కాక ప్రశ్నోత్తరాల సమయం గంట సేపు కొనసాగిస్తామని అన్నారు. ఇక సభలో ఏ అంశాలపై చర్చ జరపాలన్నది బీఏసీలో నిర్ణయిస్తామని ఆయన అన్నారు. సమావేశాల కంటే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన అన్నారు, అయితే రైతు ఆందోళనల నేపద్యంలో ఈసారి జరగనున్న పార్లమెంట్ సమావేశాల మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.