ఆషాఢ మాసానికి ఇంత ప్రత్యేకత ఉందా?

-

అషాఢం అంటే చాలు అందరికీ ఆసక్తి. కొత్త దంపతులకు, అత్త అల్లులకు, అత్త కోడళ్లకే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాశస్త్యం కలిగినది ఆషాఢం. ఆషాఢమాసం అనేక పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసం అంటారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకొంటారు. ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి.

Do you know what is the speciality of ashada Masham

సూర్యుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. పూరి క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగన్నాధ రథయాత్రను నిర్వహిస్తారు. ఈ మాసంలోనే స్కందపంచమి, సుబ్రమణ్యషష్టి వస్తాయి. తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. మహాభారతాన్ని రచించిన వ్యాసుభగవానుడిని ఆరాధించే రోజే ఆషాఢపౌర్ణమి దీన్నే గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు.

దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాఢమాసం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news