అమ్మాయిలు బహిష్టు సమయంలో వీటిని తప్పక చేయాలట..!

అమ్మాయిలు అనగానే అన్నీ ఉంటాయి.. పెళ్ళికి ముందు నెలసరి, పెళ్ళి తర్వాత గర్భం ఇలా చనిపొయె వరకూ ఏదోకటి ఎదురవుతుంది.దానిని మార్చలేము..అయితే అమ్మాయిలు నెలసరి సమయంలో కొన్ని ధర్మాలు పాటించాలి అని పండితులు అంటున్నారు.రుతుక్రమం ప్రారంభమైన సమయంలో దానిని పెద్ద మనిషి అని అంటూ ఉంటారు ఈ సమయంలో కొన్ని కట్టుబాట్లు పాటించాలని పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట.అప్పుడు కొన్ని నియయాలను అనుసరించడంతో శరీరంలో వచ్చిన మార్పులను కూడా తట్టుకోవాలి.

ఇలా జాగ్రత్తలు పాటించడం వల్ల అటు ఆరోగ్యానికి, ఇటు శాస్త్రీయంగా కూడా మేలు జరుగుతుందని సూచిస్తూ ఉంటారు. ఆరోగ్య పరమైన నియమాలు పాటించి తీరాలని వైద్యులు నొక్కి చెబుతారు. మంచి సంతానం కలగడం కోసం ఈ నియమాలను పాటించాలంటారు. యజుర్వేదం ప్రకారం అయితే రజస్వల అయిన సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటంటే.. బయట ఉన్న స్త్రీతో కలిస్తే పుట్టబోయే పిల్లలు దొంగలు అవుతారు. ఆ స్త్రీలో మాటలు కలిపితే సిగ్గు పడే మనస్తత్వం వస్తుంది. తలంటుకుంటే కుష్ఠ మొదలగు రోగాలతో పుడతాడు.

నేలమీద రాసినచో బట్టతల ఉండే పిల్లలు కలుగుతారు. బయట ఉన్న స్త్రీలు కాటుక పెట్టుకుంటే గుడ్డి వాళ్లు పుడతారు. పండ్లు తోము కుంటే పుప్పి దంతాలు కలిగినవాడు, కుట్టితే నసంపుకుడు, ఆకులతో నీళ్ళు తాగితే పిచ్చి వాడు, తాళ్ళు పేనితే ఉరి పోసుకుని చనిపోయే వాడు కలుగుతారు.ఇత్తడి పాత్రలో నీటిని తాగవచ్చు. బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఉతక్కోకూడదు. నాల్గవ రోజున వడ్లు దంచాలని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది. పగలు నిద్రపోకూడదు. మాంసం తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.వీటితో ఇంకా కొన్ని పాటించడం చాలా మంచిది. కానీ ఈరొజుల్లొ చాలా మంది ఇలాంటివి పట్టించుకోరు..శాస్త్రాల ప్రకారం పాటించడం మంచిది.