పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర స్వామి వారి గడ్డం కింద ఎందుకు ఉంచుతారంటే..?

-

తిరుమల వెంకటేశ్వర స్వామి వారని దర్శించుకోవడానికి ఎక్కడ ఎక్కడ నుండో భక్తులు వస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే గ్రంధాలైనా చాలవు. ఎంత ప్రసిద్ధి చెందిన దైవమో అందరికీ తెలుసు. ఇది ఇలా ఉంటె మామూలుగా శ్రీ వారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరం తో అలంకరించడం మనకి తెలుసు. మరి దానికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడే చూడండి. పూర్తి వివరాల్లోకి వెళితే… వెంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు ఉన్నారు. వారిలో అగ్రగణుడు అనంతాళ్వారు. నిత్యం వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూ ఉండేవాడు. శ్రీవారి కొండ వెనుక భాగం లోనే అనంతాళ్వారు నివసించేవాడు. ఎంతో భక్తి తో ఏడుకొండల వారికి పూల మాలలు సమర్పించేవాడు. ఒక రోజు ఇతను పూల తోటని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని అనుకున్నాడు.

అతని భార్య నిండు చూలాలు. ఇద్దరు కలిసి తవ్వాలని ప్రారంభించారు. గడ్డపారతో మట్టిని తవ్వి అనంతాళ్వారుని ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఇలా జరుగుతుండడం వెంకటేశ్వర స్వామి చూసి 12 సంవత్సరాలు బాలుని రూపం లో అక్కడికి వచ్చాడు. అనంతాళ్వారు ఆ బాలుడు సాయం చేస్తానంటే ఒప్పుకోలేదు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు పని ప్రారంభించాడు. మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్పింది.

ఆగ్రహానికి గురైన అనంతాళ్వారులు కోపం తో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసిరాడు. దీనితో కనబడకుండా మాయం అయిపోయాడు. స్వామి వారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయారు అర్చకులు. ఈ విషయం అనంతాళ్వారుకు చెప్పారు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి తనని మన్నించమని కోరాడు. ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దాడు. ఆరోజు నుండి చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అది ఆచారంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news