మీ పెళ్లి ఆలస్యం అవుతోందా? అయితే ఇలా హనుమంతుడిని పూజించండి.!

వివిధ కారణాల వల్ల పెళ్లి ఆలస్యం అవుతోందా…? అయితే ఇప్పుడు హనుమంతుడిని పూజిస్తే మీ వివాహం అవుతుందని పండితులు అంటున్నారు. మరి దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకోండి. అనేక సమస్యలకి పరిష్కారం చూపించడం జరుగుతోంది. మీకు దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. అలా చేస్తే మీకు తప్పక విజయం కలుగుతుంది.

మీరు కనుక అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటే ఆవ నూనెతో దీపారాధన చేస్తే – ఆరోగ్యం కలుగుతుంది. అదే మీకు పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావాలంటే బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. ఒకవేళ మీరు అనుకున్నది నెరవేరాలి అంటే బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి. అలానే ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం తీసుకుని.. ఈ ఐదింటిని పిండి చేసి దీప ప్రమిదగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అదే వివాహం కాని వారు వివాహం అయ్యేందుకు ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి. అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపం వెలిగిస్తే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ పరిహారాల్లో దేన్నైనా ఆంజనేయ స్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. ఇలా చేస్తే ఈ సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. హనుమంతుడిని పూజించే వారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతి బాధలు తొలగిపోతాయి.