రాక్ష‌సిని కుల దైవంగా కొలిచే భ‌క్తులు.. ఎక్క‌డో తెలుసా..

-

భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విశయం తెలిసిందే. సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తాం. ఇక చెడు చేసేవారిని దయ్యం, రాక్షసులుగాను భావిస్తాం. వారిని దూరం పెడుతాం. అయితే దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి హిడింబిని కుల దైవంగా పూజిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఎక్క‌డ చేస్తారు? అన్న‌ది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం..

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడింబి దేవాలయం. స్థానికంగా ఈమెను హడంబ అని కూడా పిలుస్తారు. అయితే పంచపాండవుల్లో ఒకడైన భీమసేనుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అంతేాకాకుండా పాండవులు రాక్షసుల భారిన పడకుండా కాపాడటంలో ఈమె కూడా ఎంతో సహాయం చేసింది. ఈమె రాక్షస సంతతికి చెందినదైనా కూడా గొప్ప దైవ భక్తి కలిగినది. అందువల్లే మనాలిలోని స్థానిక గిరిజన తెగల ప్రజలు ఈమెను తమ ఆరాధ్య దైవంగా పూజిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు ప్రత్యేకంగా దేవాలయం కూడా నిర్మించారు.
హిడింబి ఓ రాక్షసి. అయినా ఆమె జన్మదినం సందర్భంగా ఈ దుంగ్రీ ఉత్సవాన్ని జరుపుతారు. ఈ హిడింబి దేవాలయం ఉన్న చోట జరిగే ఈ ఉత్సవం చూడటానికి చుట్టు పక్కల ఉన్న దేవతలందరూ హాజరువుతారని స్థానిక గిరిజనుల నమ్మకం. హిడింబిని భక్తితో కొలిస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని ముఖ్యంగా కోరుకొన్న వ్యక్తే వరుడుగా వస్తాడని స్థానిక గిరిజన యువతుల న‌మ్ముతారు. ఈ ఉత్సవం జరిగే సమయంలో స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడకు ఎంతో మంది వస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news