కుంభమేళకు పేరుగాంచిన ప్రయాగరాజ్‌ విశేషాలు మీకు తెలుసా !

ప్రయాగరాజ్‌.. అదేనండి పాతపేరు అలహాబాద్‌. త్రివేణి సంగమం. ఈ క్షేత్రంలో స్నానం ఆచరిస్తే చాలు సకల పాపాలు పరిహారం అవుతాయని నమ్మకం. ఇక్కడ జరిగే కుంభమేళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రకాల ఉపాసకులు ఇక్కడికి వస్తారు. మాఘమాసంలో ఇక్కడ ఆచరించే స్నానాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. మాఘమాసం సందర్భంగా ఈ నగర విశేషాలు తెలుసుకుందాం…

అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అంతే కాకుండా హిందువులకు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ ఆధునిక భారతదేశం అంతిమ గమ్యాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. పూర్వం ఈ నగరాన్ని వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారత గ్రంధములలో ప్రయాగ అని పిలిచేవారని చెప్పబడింది. అలహాబాద్ చరిత్ర మొఘల్ చక్రవర్తి అక్బర్ 1575 వ సంవత్సరంలో ఈ నగరమునకు ల్లహబాస్ అనే పేరును నామకరణం చేసేను. ఆ తర్వాత కాలంలో అలహాబాద్ గా గుర్తింపు పొందింది. అక్బర్ ఉత్తర భారతదేశంలో ఒక జలమార్గం,దాని ప్రాముఖ్యతను గుర్తించి పవిత్ర సంగం ఒడ్డున ఒక అద్భుతమైన కోటను నిర్మించెను. కొన్ని దశాబ్దాల తర్వాత అలహాబాద్ మరోసారి బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం భారతదేశం యొక్క పోరాటంలో ప్రధాన ప్రదేశంగా ఉన్నది. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ ను1885 వ సంవత్సరంలోఅలహాబాద్ లో ప్రారంబించారు. మహాత్మా గాంధీ 1920 లో తన అహింస ఉద్యమమును కూడా ఇక్కడే ప్రారంభించారు. బ్రిటిష్ కాలంలో అలహాబాద్ ఉత్తర పాశ్చాత్య ప్రాంతాల ప్రధాన కార్యాలయంగా కూడా ఉంది.

ఈ నిర్దిష్ట తరానికి బాగా సంరక్షించబడిన ముయిర్ కాలేజ్ మరియు సెయింట్స్ కేథడ్రల్ ఉన్నాయి. అలహాబాద్ ఒక తీర్థయాత్ర సెంటర్ ఏమైనప్పటికీ అలహాబాద్ నేడు ప్రయాగరాజ్‌గా పిలుస్తున్నారు. పురాణం ప్రకారం విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ యజ్ఞం కొరకు ఈ అలహాబాద్ ను ఎంచుకున్నారు. ఆయన ఈ స్థలం పవిత్రతకు అనుగుణంగా దీనికి ‘తీర్థం రాజ్’ లేదా అన్ని యాత్రా ప్రదేశాలలో రాజు అని పేరు పెట్టారు. అలహాబాద్’సంగం’లేదా గంగా,యమునా, అంతర్వాహిని అయిన సరస్వతి అనే మూడు పవిత్ర నదుల సంగమం. 12 ఏండ్లకు ఒక్కసారి జరిగే మహా కుంభ మేళ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది. 2001లో జరిగిన చివరి మహా కుంభ మేళా కు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ కుంభమేళా సమయంలో అత్యంత చల్లదనము ఉన్న పవిత్ర జలాలలో స్నానం చేయుట వల్ల పాపాల నుండి విముక్తి కలుగుతుందని బావిస్తారు.

వార్షిక మాఘ్ మేళా కూడా జనవరి నెలలో సంగం ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అలహాబాద్ ను కుంభమేళా సమయంలో అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడ మహాదేవి వర్మ,హరివంశ్ రాయ్ బచ్చన్,మోతిలాల్ నెహ్రూ,జవహర్ లాల్ నెహ్రూ,మురళీ మనోహర్ జోషి తో సహా ప్రసిద్ధి చెందిన అనేక మంది ప్రముఖులు జన్మించారు. అలహాబాద్ పర్యాటకం మతం,సంస్కృతి చరిత్రలను కలిగి ఉంది. అలహాబాద్ చుట్టూ పర్యాటక స్థలాలు అలహాబాద్ లో పర్యాటక ప్రదేశాలుగా దేవాలయాలు,కోటలు,విశ్వవిద్యాలయాలు మరియు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ పాటల్పురి ఆలయం,హనుమాన్ టెంపుల్,బడే హనుమంతుని ఆలయం,శివకోటి మహదేవ్ ఆలయం,అలోపీ దేవి ఆలయం,కళ్యాణి దేవి ఆలయం, మన కామేశ్వర్ ఆలయం, నగ్వాసుకి ఆలయం, బెనిమధవ్ ఆలయంతో సహా అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.

ఇంకా నగరంలో అలహాబాద్ కోట,మింటో పార్క్ మరియు అల్ఫ్రెడ్ పార్క్,నగరంలో అతిపెద్ద హరిత ప్రదేశాలలో ఒకటైన థోర్న్హిల్ మైనే మెమోరియల్ మరియు ఖుస్రో బాగ్,ఒక కుడ్య మొఘల్ గార్డెన్తో సహా బ్రిటిష్, మొఘల్ శకంలో మిగిలిన అనేక అవశేషాలను కలిగి ఉంది. త్రివేణి సంగమంగా, చారిత్రక ప్రదేశంగా ప్రయాగరాజ్‌ భాసిల్లుతుంది. వారణాసి అంటే కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని సందర్శించండి.