తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. తాజాగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ ఉద్యోగులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సునీల్ శర్మ ప్రకటించారు. ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కేఎంపీఎల్‌అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు అవార్డులను అందించిన మంత్రి మాట్లాడుతూ… ఉద్యోగుల బదిలీలు, ఓడి తదితర అంశాలపై సైతం చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. సమష్టి కృషితో నెలకు రూ.80-90 కోట్ల అధిక ఆదాయం వచ్చిందని ఆయన అన్నారు. సంస్థ ఇదే విధంగా ముందుకు కొనసాగితే డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలనే,
ఆలోచనలో సంస్థ ఉందని వివరించారు ఆయన. అలాగే సురక్షిత డ్రైవింగ్‌తో ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుండటం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. సంస్థలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై దృష్టిసారించామని ఆయన వివరించారు. సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు. త్వరలో కార్గో సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు.