బోనాల ఉత్స‌వాల‌ను ఎలా నిర్వ‌హిస్తారంటే..?

-

బోనాల వేడుకల్లో భాగంగా భక్తులు ఒకప్పుడు దున్నపోతులను బలిచ్చేవారు. కానీ ప్రస్తుతం కోడిపుంజులను, మేకలు, గొర్రె పోతులను బలిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ గ్రామాల్లో ఉండే దుష్టశక్తులు పోతాయని భక్తుల విశ్వాసం.

ఆషాఢ మాసంలో బోనాల పండుగ వస్తుందంటే చాలు.. జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఉత్సవాలు ప్రారంభమవుతాయా.. ఎలా జరుపుదామా.. అని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే అమ్మవారి ఆలయాల్లో ఈ మాసమంతా సందడిగా ఉంటుంది. ఇక పల్లెలు, పట్టణాలతోపాటు నగరాల్లోనూ బోనాల శోభ మనకు కనిపిస్తుంది. అయితే బోనాలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మహిళలు అమ్మవారికి సమర్పించే బోనమే.. దీన్ని మహిళలు వండుకుని ఆలయానికి తెచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.

బోనం అంటే.. భోజనమే.. అమ్మవారికి సమర్పిస్తారు కనుక దానికి బోనం అని పేరు వచ్చింది. మహిళలు వండిన అన్నంతోపాటు పాలు, పెరుగు, బెల్లం, కొందరు ఉల్లిపాయలను కలిపి మట్టి లేదా రాగి కుండల్లో ఆహారం పెట్టుకుని అనంతరం ఆ కుండలను తలపై పెట్టుకుని ఆలయం దాకా వస్తారు. డప్పు చప్పళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులను తీర్చుకుంటారు. ఇక కొందరు తాము అనుకున్నవి నెరవేరాలని కోరుతూ అమ్మవారిని ప్రార్థిస్తారు. అయితే మహిళలు తాము తీసుకువెళ్లే బోనాల కుండలను వేపాకులు, పసుపు, కుంకుమ లేదా తెల్ల ముగ్గులతో అలంకరిస్తారు. అనంతరం కుండపై దీపం ఉంచి దాన్ని ఆలయానికి తీసుకువస్తారు. ఆ తరువాతే బోనంతో అమ్మవారికి పూజలు చేస్తారు.

ఇక బోనాల వేడుకల్లో భాగంగా భక్తులు ఒకప్పుడు దున్నపోతులను బలిచ్చేవారు. కానీ ప్రస్తుతం కోడిపుంజులను, మేకలు, గొర్రె పోతులను బలిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ గ్రామాల్లో ఉండే దుష్టశక్తులు పోతాయని భక్తుల విశ్వాసం. ఇది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే అలా జంతుబలి అయ్యాక దాంతో మాంసాహార విందు భోజనం చేస్తారు. అతిథులకు వంటలను వడ్డిస్తారు. ఇలా బోనాల ఉత్సవాలు జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news