హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగనుండటంతో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరూ విమర్శించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు గన్ పార్కు వద్దకు తన రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి ఎవ్వరూ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే.. తాను రాజీనామా చేస్తానని.. చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

ఆగస్టు 15న లోపు రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామని హామి ఇచ్చారు. హరీశ్ రావు తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలన్నారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకు ఎందుకు అధికారం..? మీలా దోచుకోకుండా ఉంటే రూ.40వేల కోట్లు ఇవ్వడమో లెక్కా..? అని వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వాలని హరీశ్ రావుకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news