లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే వీటిని ఇంట్లో ఉంచుకోండి !

-

లక్ష్మీకటాక్షం కోరుకోని వారు ఎవరూ ఉండరు. అయితే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే చాలు అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఆ వస్తువులు ఏమిటో వివరాలు తెలుసుకుందాం…

దక్షిణావర్త శంఖం, ముత్యాల శంఖం, ఏకాక్షి నారికేళం, మారేడుకాయ, పసుపు,కుంకుమలు, తాటాకు తదితరాలు.
ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందని ఆయా పురాణాల్లో పేర్కొన్నాయి.

దక్షిణావర్త శంఖం- ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపుకు తెరచుకుని వుంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్త శంఖం శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకుని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు. లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే … లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరుకుతాయి. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే కావడం విశేషం. అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు. దక్షిణావర్తి శంఖాలు మోగవు … కానీ మొగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకుని పూజించాలి. పగిలినది, విరిగినది, పల్చనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు పూజకు పనికిరావు. ఈ శంఖాలు వున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి, రామేశ్వరం వంటి క్షేత్రాలలో దొరుకుతాయి.
ముత్యాల శంఖం : ముత్యపు కనతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే. ఈ శంఖాన్ని బుధవారం రోజు
ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనదాన్య సంరుద్ధిం దేహిదేహి నమః
ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి.
ఏకాక్షి నారికేళం : మామూలు కొబ్బరికాయలకు రెండు కళ్ళు వుంటాయి. కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి (ఒంటికన్ను) నారికేళానికి ఒకే కన్ను వుంటుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి, ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి, ధనలాభం చేకూరుతుంది .

తాటాకు- సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. శ్రీలలితా సహస్రనామంలో కూడా తటాంకయుగళ అని అమ్మవారి నామం. చెవులకు కమ్మలుగా తాటాకులను ఉపయోగించిన తల్లి అని అర్థం ఆ తల్లికి తాటాకు అంత ప్రీతికరం. సంతాన వృద్ధికోసం దీన్ని పూర్వం వాడేవారు. పసుపు, కుంకుమలతో ఇంటి ముందర ముగ్గు అలంకరణ, గడపల అలంకరణ, ముత్తైదువలు నిత్యం పసుపును కాళ్లకు పెట్టుకోవడం, నుదట పాపట వద్ద సింధూరం లేదా కుంకుమ ధారణ స్థానాలు అమ్మవారికి ప్రీతికరమైనవి. అదేవిధంగా మరికొన్ని పదార్థాలు లక్ష్మీస్థానాలుగా చెప్తారు. మీకు వీలైన వాటిని ఆచరించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి.

కేశవ

Read more RELATED
Recommended to you

Latest news