భక్తి : మీ ఇంట్లో ఆనందం, శాంతి, సంపద కలగాలంటే ఇలా చెయ్యండి..!

-

ప్రతీ రోజు ఏదో ఒక సమస్యో..! లేదా అశాంతి ఉండడం ఇలా తరచూ జరిగినప్పుడు ఎన్నో నోములు, వ్రతములు చేస్తూ ఉంటారు. కొందరైతే జ్యోతీష్యులని అనుసరించి వాళ్ళు చెప్పిన మార్గం లో నడుస్తారు. ఏది ఏమైనా ఇంట్లో ఆనందం, శాంతి కావాలని అనుకునే వారు ఈ మార్గాన్ని కనుక అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. నమ్మకం తో ఆచరిస్తే అనుకున్నది జరుగుతుంది.

ఇక విధానం ఏమిటి అనే విషయానికి వస్తే… కుబేరుడి గురించి మనకి తెలిసినదే. వేంకటేశ్వర స్వామికి ఆయన కల్యాణ సమయం లో అప్పిచ్చాడు. అంటే ఎంత డబ్బు కుబేరుడి దగ్గర ఉందో..! అయితే కుబేరుడి మనసుని గెలుచుకుంటే… ఆనందం మరియు శాంతిని పొందవచ్చు. ఇక కుబేరుడికి ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే… ధ్యానంలో కూర్చున్నప్పుడు ”ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే… ఎక్కువ సంపద కలగడమే కాక అనుకున్న కళలు నెరవేరుతాయి. ఇలా కొత్త ఇల్లు, కారు వంటివి పొందాలనుకునే వారు కూడా చెయ్యొచ్చు.

ఇలా ఈ మంత్రం తో మీరు అనుకున్నది సాధించగలరు. అలానే మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సు మరియు సంపద పొందడానికి “ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయే ధనధాన్యసమృద్ధిం మి దేహీ దాపయా శ్వాహ !” అనే మంత్రాన్ని జపించాలి. ఇది ఇలా ఉండగా మీరు అంతులేని సంపదను పొందాలనుకుంటే మాత్రం “ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః” అనే మంత్రాన్ని రోజూ 108 లేదా 1008 సార్లు చెప్పుకుంటే అనుకున్న పనులు పూర్తవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news