వీటి మీద దృష్టి పెడితే లక్ష్మి దేవి ఆశీస్సులు ఉంటాయి..!

చాణక్య ఎన్నో ముఖ్యమైన విషయాలని చెప్పారు. వీటిని మనం అనుసరిస్తే లైఫ్ లో సక్సెస్ పొందడానికి అవుతుంది. ఏ సమస్య నుండైనా బయట పడడానికి అవుతుంది. చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలని చాణక్య నీతి ద్వారా మనం పరిష్కరించుకోవడానికి అవుతుంది. అయితే లక్ష్మీ దేవి ఆశీస్సులు కనుక పొందాలంటే కచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి.

వీటిని కనుక అనుసరిస్తే ఎలాంటి బాధ ఉండదు. లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం వంటివి మనిషిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి తప్ప వాటి వలన ఉపయోగం లేదు. ఇలా ప్రవర్తించే ధనవంతులు ఎప్పుడూ కూడా పేద వాడి గానే ఉండిపోతాడు. ఎప్పుడూ కూడా మనిషి తన సంపద గురించి కానీ స్థానం గురించి కానీ అందం గురించి కానీ ఎప్పుడూ ప్రదర్శించకూడదు.

ఎవరి హృదయం లో అయితే నిజాయితీ ఉంటుందో నిడారంబరంగా ఎవరుంటారు..? వారి దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. అలానే అందరి పట్ల గౌరవంగా ఉండాలి. గౌరవంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. భార్యా భర్తల మధ్య గొడవలు వస్తే కూడా ఇంట్లో దారిద్రం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తే డబ్బు నిలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే లక్ష్మీదేవి కచ్చితంగా మీ ఇంట ఉంటుంది.