రెండు రోజుల్లోనే వీరయ్య విధ్వంసం సృష్టించేశాడుగా..!!

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ రేంజ్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే ఊహకందని ఊచకోత కోసి మెగాస్టార్ రేంజ్ ఏంటో నిరూపించింది. ముఖ్యంగా సినిమా అనుకున్న అంచనాలన్నింటిని మించిపోయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా రూ.10 కోట్లకు పైగా షేర్ కన్ఫార్మ్ అనుకోగా .. ఆ అంచనాలను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది ఈ సినిమా. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా రెండో రోజే ఏకంగా రూ.11.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకొని దుమ్ముదులిపేసింది.

నైజాం : రూ.4.96 కోట్లు
సీడెడ్ : రూ. 2.48కోట్లు.
ఉత్తరాంధ్ర : రూ.1.44 కోట్లు
ఈస్ట్ : రూ.88 లక్షలు
వెస్ట్ : రూ.36 లక్షలు
గుంటూరు : రూ.67 లక్షలు
కృష్ణ : రూ.80 లక్షలు
నెల్లూరు : రూ.36 లక్షలు

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కలిపి మొత్తం 11.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సినిమా రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 26.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టి 14.60 కోట్ల దాకా షేర్ అందుకుంది. రెండు రోజుల టోటల్ కలెక్షన్స్ గమనించినట్లయితే..

నైజాం : రూ.11.06కోట్లు
సీడెడ్ : రూ. 6.68కోట్లు.
ఉత్తరాంధ్ర : రూ.4.01 కోట్లు
ఈస్ట్ : రూ.3.56 కోట్లు
వెస్ట్ : రూ.2.42 కోట్లు
గుంటూరు : రూ. కోట్లు
కృష్ణ : రూ.2.29 కోట్లు
నెల్లూరు : రూ.1.41 కోట్లు

ఆంధ్ర తెలంగాణ కలిపి మొత్తం రూ. 34.85 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది.అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.2.90 కోట్లు, ఓవర్సీస్ రూ.6.15 కోట్లు రాబట్టింది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ.43.90 కోట్ల కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించింది ఈ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news