శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే కోటేశ్వరులు అవుతారు..!

-

శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి.లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధన ప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదంటే ఎర్ర గులాబీ పూలు సమర్పించాలి. పూజ సమయంలో శ్రీ సూక్తాన్ని పట్టించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకధార స్తోత్రం పాటించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరతాయి. అలాగే మీరు సంపాదించిన డబ్బులు స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవిని గణేశుడుని ఇద్దరిని కలిసి పోషించాలి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ ఆలయానికి వెళ్లి కమలం తెల్ల మిఠాయిలు శంఖం వంటివి సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది..

ఇక సంతానం లేని వారు గజలక్ష్మీ అమ్మవారిని పూజించాలి. సంతానంతో పాటు సంపద ఆస్తి కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పూజ స్థలంలో శ్రీ యంత్రాన్నీ స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే పూజా స్థలంలో సోమ పుష్య యోగంలో దక్షిణవర్తి శంఖాన్ని ప్రతిష్టించండి.. ఇలా చెయ్యడం వల్ల అమ్మవారితో పాటు విష్ణు మూర్తి అనుగ్రహం కూడా దొరుకుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news