బొట్టు ఏవేలితో పెట్టుకోవాలి? ఇంత లాజిక్ ఉందా…??

-

హిందూ సంస్కృతిలో ఎన్నో ఆచ‌రాలు, నియ‌మాలు ఉన్నాయి. వాటిలో బొట్టు పెట్టుకోవ‌డం ఒక సంప్రదాయ సంస్కృతిగా వ‌స్తుంది. బొట్టు పెట్టుకోవ‌డం వ‌ల్ల మ‌న‌లో దైవ భావం పెర‌గ‌డంతో పాటు, ఆరోగ్య ప‌రంగా ఆజ్ఞాచక్రం శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా బొట్టుపెట్టుకున్న‌వారిని చూస్తే ఎదుటి వారిలో
పవిత్ర భావన క‌లుగుతుంది.

మనం నిత్యం పాటించే కొన్ని పద్దతులు అసలు ఎలా వచ్చాయి..?? వీటిని ఇలానే ఎందుకు చేయాలి అంటూ కూలంకషంగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. గడపకి పసుపు ఎందుకు రాస్తారు అంటే లక్ష్మీదేవి ఉండాలంటే పసుపు రాయాలి శుభసూచకం  అని శాస్త్రం అంటే. క్రిమి కీటకాలు, వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే పసుపు రాస్తారు అంటూ సైన్స్ చెప్తుంది. ఎలా చూసినా నమ్మకం, శాస్త్రం కలిపితే మనిషికి ఎంతో మేలు చేసేవిగానే ఉంటాయి. సరే ఇక అసలు విషయంలోకి వెళ్తే..

హిందూ సాంప్రదాయం ప్రకారం నుదిటిన బొట్టు పెట్టుకుంటారు.. ఇలా బొట్టు పెట్టుకున్నా లేదా ఎవరన్నా శుభకార్యానికి పిలిచే ముందు కూడా బొట్టు పెట్టి మరీ పిలుస్తారు. ఎవరు బొట్టు పెట్టినా సరే కుడి చేతి ఉంగరం వేలుని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకు..??? అసలు ఆ వేలుతోనే ఎందుకు బొట్టు పెట్టుకుంటారో మీకు తెలుసా..?? ఆ ఒక్క వేలుతోనే కాకుండా మిగిలిన వేళ్ళతో కూడా చాలా మంది బొట్టు పెట్టుకుంటారు. మరి మిగిలిన వేళ్ళతో బొట్టు పెట్టుకుంటే ఏమిటి లాభం..??

హిందూ శాస్రం ప్రకారం మధ్య వేలు అనేది శని గ్రహ స్థానం. ఈ గ్రహం పూర్నాయుష్ ఇస్తుందనేది శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మన పెద్దలు కూడా బొట్టు పెట్టుకునే ముందు మధ్య వేలుతో బొట్టు పెట్టుకో అని చెప్తూ ఉంటారు.

ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకునే మానసికంగా ఎంతో ధృడంగా ఉంటామాట. అందుకు కారణం ఏమిటంటే అది సూర్య స్థానం కాబట్టి ప్రశాంతతని కలిగి ఉంటుందట. అంతేకాదు గొప్ప పండితులుగా  మార్పు చెందటానికి కూడా అవకాశాలు ఉంటాయట.

ఇక బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే శారీరక బలం కలుగుతుందట. అంతేకాదు విజ్ఞాన సముపార్జన కూడా సిద్దిస్తుందనేది పెద్దల సూచన. ఆరోగ్యాన్ని కలగజేయడంలో కూడా ఆ స్థానం మేలు చేకూర్చుతుందట. ఈ స్థానం శుక్రుడిది కాబట్టి మరింత శక్తివంతమైన ఆరోగ్యం కలుగుతుందట.

గురు స్థానంగా చూపుడు వేలు ఉంటుందట. ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుందనేది శాస్త్రం చెప్తోంది. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే సులభంగా చేదించే శక్తి కలుగుతుందట. అయితే శరీరంలో ఎన్నో చోట్ల బొట్టు పెట్టుకునే అవకాశం ఉన్నా నుదిటిపై ఎందుకు పెట్టుకుంటారంటే ఆ స్థానం అంగారకుడిదట. అంగారకుడికి ఎరుపు బాగా ఇష్టమట కాబట్టే ఆ స్థానంలోనే అధికంగా బొట్టు పెట్టుకునే అలవాటు చేశారు పూర్వీకులు.  

Read more RELATED
Recommended to you

Latest news