కరోనా వల్ల అనాధలైన పిల్లలకు 5లక్షల ఇన్స్యూరెన్స్.. కేంద్రం.

-

కరోనా సృష్టిస్తున్న విలయతాండవం అంతా ఇంతా కాదు. వారు వీరు అని తేడా లేకుండా అందరి మీదా ప్రతాపం చూపించింది. ఇంకా చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం కేసుల పెరుగుదల చూస్తుంటే రెండవ వేవ్ ఇంకా అయిపోలేదని, కొనసాగుతూనే ఉందని అనిపిస్తుంది. అటు ప్రభుత్వం కూడా డెల్టా వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే అని హెచ్చరికలు జారీ చేసింది. ఐతే కరోనా సృష్టించిన భీభత్సాల్లో సెకండ్ వేవ్ చాలా కీలకం. ఒక్కసారిగా వచ్చిన ఈ తరంగానికి ఎంతో మంది బలయ్యారు.

చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఎంతో మంది పిల్లలు అనాధలైనారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనాధలైన పిల్లల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. కోవిడ్ కారణంగా అనాధలైన పిల్లలకు 18సంవత్సరాల లోపు వారికి 5లక్షల ఉచిత ఇన్స్యూరెన్స్ అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని పీఎమ్ కేర్స్ వారు జమ చేస్తారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news