ధన – సంపదలు పెరగాలంటే ఏం చేయాలి?

-

Increase wealth and prosperity with Sri Lakshmi Narayana Pooja

ధనం మూలం ఇదం జగత్ అనేది శాస్త్ర నానుడి అందరికీ తెలిసిందే. అయితే చాలామంది ఎంతో కష్టపడ్డా జీవితాల్లో పెద్ద మార్పు ఉండదు. పైగా తనకంటే చిన్నవారు కూడా తనముందే లక్షాధికారులుగానో, కోటీశ్వరులుగా ఎదుగుతుంటే ఒకవైపు బాధ మరోవైపు తన జీవితంపై విరక్తి కలుగుతుంటాయి. అయితే ఒక్క సత్యాన్ని మాత్రం మరవద్దు. ధనం, సంపదలు అనేవి కేవలం ప్రస్తుత జన్మకే సంబంధించినవి కావు. గత జన్మల వాసనా బలాలతో ముడిపడి ఉండే అంశం. గత జన్మలలో దానం, ధర్మం చేసి ఉంటే ఈ జన్మలలో వాటి ఫలితాలను అనుభవించగలుగుతారు లేకుంటే లేదు. అయితే ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మీ ఇంట్లో ధనం, సంపద పెరగడానికి కింది పరిష్కారాలను పాటించండి. వాటిని నమ్మకం, శ్రద్ధ, భక్తితో భగవంతుడిపై భారం వేసి ఆచరిస్తే తప్పక ఫలితాలు లభిస్తాయని శాస్ర్తాలు ఉవాచ. వాటిని పరిశీలిద్దాం…

– ఇంట్లో ఈశాన్యమూలన తులసీ మొక్కను పెంచండి. పూజాగదిలో గంగాజలాన్ని ఉంచండి దీనివల్ల ధనం పెరుగుతుంది.
– ఇంట్లో కూర్చొని ఉన్న లక్ష్మీదేవీ (ఇరువైపులా దిగ్గజాలు అంటే ఏనుగులు ఉన్న) ఫొటో పెట్టుకోండి.
– వ్యాపార సంస్థల్లో అయితే నిలుచున్న  ఫొటోను పెట్టుకోవాలి.
– లక్ష్మీ దేవీ స్వభావం చంచలం. అమ్మ స్థిరంగా ఉండాలంటే లక్ష్మీపతి వెంట ఉంటే తప్పక ఆమె అక్కడ స్థిరంగా ఉంటుంది. అంటే నారాయణుడు (విష్ణువు) ఎక్కడ ఉంటే లక్ష్మీ అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి నారయణుడను ప్రసన్నం చేసుకునే పనులు ఎక్కువగా చేయాలి. శ్రీనివాసడను, లేదా శ్రీహరి లేదా వేంకటేశ్వరుడికి సంబంధించిన జపాన్ని కొంత సేపు నిష్ఠతో చేయండి లేదా ధ్యానం చేయండి. కొంత కాలానికి మీకు మార్పు కనిపిస్తుంది.
– అవకాశం ఉన్నవారు రావిచెట్టుకు శనివారం, మంగళవారం పాలు, నీళ్లు, బెల్లం కలపిపోసి ప్రార్థనచేయాలి. రావిచెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్ విష్ణుస్వరూపం అయిన రావిచెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news