ధన సంపదకు, సుఖ సంతోషాలకు అది దేవత మహాలక్ష్మి అమ్మవారు అని అందరికి తెలిసిన సంగతే. సుఖ సంపదలిచ్చే దేవత మాత్రమే కాక దయ మంచితనానికి ప్రతీక ఈ అమ్మవారు. విష్ణుమూర్తి తన భక్తులకు అంత తేలికగా వరాలు ఇవ్వడు అని ప్రతీక. కాని అమ్మవారికి నివేదిస్తే వెంటనే ఆ భక్తుడి కోరికలన్నీ తీరుస్తాడు. అమ్మవారి దయ, కరుణ అటువంటిది. అందుకే ఆమెకు ప్రత్యేక ఆలయాలు వెలిశాయి. వాటిలో కర్ణాటకలో ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో దొడ్డి గొడ్డ వల్లి గ్రామంలో మహాలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం 11 వ శతాబ్దంలో లక్ష్మి దేవి ఆలయాన్ని విష్ణు వర్ధన రాజు హోయసల నైపుణ్యం తో నిర్మించారు. దీనిని చతుష్కుట శైలి అని కూడా అంటారు. ఈ ఆలయం లో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం తో పాటు విష్ణు మూర్తి, భూత నాధుడు, మహాకాళి విగ్రహాలు కూడా ఉన్నాయి. బేలూరు హసన్ హైవే కు 16 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజ చేసిన వారిని అమ్మ కరుణించి కాపాడుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేసే వర మహాలక్ష్మి వ్రతం తో ఆమెకు దగ్గరవ్వడమే కాక ఆమె ఆలయాలను కూడా దర్శించడం వల్ల మనకు వ్రత ఫలితం కలుగుతుంది. ఇంకా ఆమె అనుగ్రహం కోసం ప్రతి ఇంటి ఇల్లాలు ఎప్పుడు అలంకార ప్రాయంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి కరుణ మన పై ఉంటుంది.