ఉసిరి చెట్టుకు కార్తీకంలో ప్రాధాన్యం ఎందుకు ?

-

కార్తీక మాసం వచ్చిందటే ఉసరికాయకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. స్నానాలు ఆచరించే దగ్గర నుంచి దీపాలు, ఆహారం ఇలా అన్నింటిలో ఉసిరిని తప్పక ఉపయోగిస్తారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి తెలుసుకుందాం…

ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి. ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు.

శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను, తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఆయుర్వేద పరంగా ఉసిరి అంటే అమృత తుల్యం అని పేరుగాంచింది. దీన్ని నిత్యంసేవించిన వారు ఆయుఆరోగ్యాలతో ఉంటారు.

శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news