నిల్వలు పెరిగాయనే పేరు తో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కొని నిల్వ చేసే అధికారాన్ని కూడా కేంద్రం ఇవ్వడం లేదని అన్నారు. వడ్ద కొనుగోలు విషయం పై మంత్రి కేటీఆర్ తో పాటు తో పాటు ఢిల్లీ కి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ ను కలిశామని మంత్రి గంగుల అన్నారు. పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిదని.. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని విజ్ఞప్తి చేశామని మంత్రి గంగుల గుర్తు చేశారు.
అయితే తాము ఈ విషయాన్ని చెబితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారని అన్నారు. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయి మళ్లి వడ్ల ను కొనలేమని గోయల్ అన్నారని గుర్తు చేశారు. ఈ విషయం పై కేంద్రాన్ని ఒప్పించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కోరితే వారు నోరు తెరవలేరని అన్నారు. ఈ రోజు మాత్రం వీరు రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న వడ్ల డిమాండ్ ను కేంద్రమంత్రుల ముందు చేయాలని అన్నారు.