పార్వతీ దేవి అనేక అవతారాలు ఎత్తింది. శిష్టరక్షణ కోసం నారాయణుడు అవతారాలు ఎత్తుతాడు. అదే స్త్రీశక్తి రూపంలో అయితే పార్వతీ అమ్మవారు అవతారాలను ఎత్తుతుంది. కామాసురుడనే రాక్షస సంహరానికి ఎత్తిన అవతారమే మూకాంబికా అవతారం. పార్వతీదేవి ఈ అవతారం ఎత్తి వెలసిన క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం..
పూర్వం కామాసురుడు అనే రాక్షసుడు శివుని నుంచి వరం పొందడం కోసం తీవ్రంగా తపస్సు చేయసాగాడు. దాంతో కామాసురుడి తపస్సుకు మెచ్చుకున్న శివుడు… అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా వరం పొందిన కామాసురుడు… కూడక్రాది పర్వతం మీద వున్న దేవతలను, మునులను, అక్కడున్న వారందరినీ తీవ్రంగా హింసించేవాడు. దేవతలు, సప్తర్షులు ఇతని నుంచి విముక్తి కలిగించుకోవడం కోసం అనేకరకాలు ప్రయత్నాలు చేస్తారు. దేవతలు, కామాసురుడిని నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి… శుక్రాచార్యుడు, కామాసురుడికి వెళ్లి చెబుతాడు. అతని చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుందన్న రహస్యాన్ని వెళ్లగక్కుతాడు. అప్పుడు వెంటనే కామాసురుడు తనని తాను కాపాడుకోవడానికి శివునికి తిరిగి తీవ్రంగా తపస్సు చేయసాగాడు. అప్పుడు శివుడు అక్కడకు ప్రత్యక్షమై తనిని ఒక వరం కోరుకోమని చెప్పాడు.
అయితే కామాసురుడికి శివుడు వరం ఇస్తే.. అతను లోకకంటకుడు అవతాడని భావించి.. సరస్వతీదేవి అతని నోటినుంచి మాటరాకుండా అతని నాలుకపై వెల్లి కూర్చుంటుంది. దాంతో అతడు మూగవాడు అయిపోయినందువల్ల శివుడితో ఏ వరం కోరుకోలేపోతాడు. అప్పటి నుంచి అతనికి మూకాసురుడు అని పిలిచారు.
కామాసురుడిని సంహరించడానికి ‘‘కోల రుషి’’ పార్వతీదేవికి ఒక ఉపాయం ఇస్తాడు. దాంతో ఆమె దేవతలందరి శక్తులను కలిపి ఒక తీవ్రశక్తిని సృష్టించింది. ముకాసురినితో యుద్ధం చేసి సంహరించింది.
అయితే మూకాసురుడు అమ్మవారిని తన పేరు మీద మూకాంబికా దేవిగా వెలసిల్లమని కోరుకోవడంతో.. అతని కోరిక మీదకు కొల్లూరులో మూకాంబిక నామంతో పార్వతీదేవి వెలిసింది. ఈ క్షేత్రం దర్శిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయని పెద్దలు చెప్తారు.
– శ్రీ