వనదేవతల జాతర.. మినీ మేడారం

Join Our Community
follow manalokam on social media

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా పూజార్లు అమ్మవార్లకు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.

అసలు కథ ఏంటి?

ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడి దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. మేడారానికి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది? వనదేవతలుగా కొలువబడుతున్న సమ్మక్క సారలమ్మ గురించి మనం తెలుసుకుందాం
పూర్వం కోయదొరలు వేటకోసకం అడవికి వెళ్లినపుడు అక్కడ ఒక పెద్ద పులుల కాలలా మధ్య ఓ పాప కనిపించింది. వారు ఆ పాపను వారి గూడేనికి తీసుకెళ్లి పెంచుకుంటారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెడతాడు గూడెం పెద్ద మేడరాజు.

జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. ఇతను తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు సమ్మక్కకు వివాహాం జరిపిస్తాడు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. అయితే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడికి కట్టాల్సిన గ్రామస్తులు ఆ ఏడాది ప్రకృతివైపరిత్యాల కారణంగా కప్పం కట్టలేకపోతారు. దీంతో మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండయాత్రకు వస్తాయి. ఈ క్రమంలో లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు– కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. సమ్మక్క పగిడిద్దరాజులు వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ, కాకతీయ సేనల ధాటికి మేడరాజు, పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు మరణిస్తారు. వారి మరణవార్తను విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్ర చెబుతుంది.

మరణం విషయం తెలిసిన సమ్మ క్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింద. వీరోచిత పోరాటం చేస్తుంది. ఆమె వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. ఒక సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతో మేడారం గ్రామానికి ఈశాన్యం దిక్కున చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోతుంది. ఆ తర్వాత చెట్టుకింద ఓ పుట్ట దగ్గర కుంకుమభరిణ కనిపించిందట. అప్పుడు ప్రతాపరుద్రుడు కూడా భక్తుడిగా మారిపోతాడు. కోయరాజు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర జరపాలని తీర్మనిస్తాడు. అది విస్త్రతంగా ప్రచారం జరిగి కుంకుమ భరిణెను సమ్మక్కగా భావించి మాఘ శుద్ధ పౌర్ణమినాడు సమ్మక్క–సారలమ్మ జాతరను నిర్వహిస్తారు.

ఈ నెల 24 నుంచి 27 వరకు జాతర వివరాలు

–  ఫిబ్రవరి 24 గుడిశుద్ధి, పూజలు గ్రామనిర్భందన
– 25 గురువారం సమ్మక్క సారాలమ్మలకు పసుపు, కుంకుమలతో అర్చన
– 26 శుక్రవారం భక్తులు అమ్మవార్ల దర్శనం
– 27 శనివారం పూజాకార్యక్రమాల ముగింపుతో మినీ జాతర మగుస్తుంది.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...