ప్రతి నిత్యం ఈ అష్టకం చదువుకుంటే ఆరోగ్యం మీ సొంతం !

-

ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద ఐశ్వర్యం ఏమిటి అని అడిగితే అనుభవజ్ఞులు చెప్పేది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని ఉన్నట్లే. కాబట్టి ప్రతీ ఒక్కరు కోరుకునేది జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అయితే మన సనాతనధర్మం ఎన్నో రహస్యాలను మంత్రాల రూపంలో, నమ్మకాలతో ఆయా క్రియలలో, నిత్యకృత్యాలలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. కానీ మనం వాటిలో ఎక్కువ భాగం నిర్లక్ష్యం చేసి అనేక బాధలు పడుతున్నాం.

అయితే ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు చెప్పిన వాటిలో ప్రధానంగా ఖర్చులేనిది, తేలికగా చేయగలిగేది ప్రాతఃకాలంలో లేవడం, కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడం, సూర్య ఆరాధన చేయడం ప్రదానమైనవి. అయితే వాటని కేవలం భౌతికంగానే కాక మానసికంగా కూడా చేస్తే ఫలితం మరింత పుణ్యప్రదం, శక్తివంతం అని సూర్యోపాసకులు పేర్కొంటున్నారు. అలాంటి వాటిలో అద్భుతమైన అష్టకం సూర్యాష్టకం.

ఆదిదేవ నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే
సప్త్యాశ్వ రథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం – త సూర్యం ప్రణమామ్యహం
లోహితం రథ మారూఢం – సర్వలోక పితామహం
మహా పాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్
బంధూక పుష్ప సంకాశం – హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్
తం సూర్యం లోకకర్తారం – మహాతేజ ప్రదీపనం
మహా పాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్
సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహ పీడా ప్రనాసనం
అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా స్ఫవేత్
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ – జన్మ జన్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని – యే త్యజంతి రవేర్దినే
నవ్యాధిః శోక దారిద్ర్యం – సూర్యలోకం చ గచ్చతి!!
ప్రతీరోజు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో ఈ అష్టకాన్ని చదివితే తప్పక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news