శనివారం శనిని పూజిస్తే సంపద మీ వెంటే!

-

ప్రతి వారం మన ఏదో ఒక దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తాం. అయితే శనిదేవుడికి మాత్రం శనివారం రోజు పూజలు చేసినట్లయితే చెడు దృష్టి తొలిగి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. అంతేకాదు ఆ శనిదేవుడు మీకు ఎలాంటి కష్టం వచ్చినా, వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కునే ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. మరి శనివారం శనిదేవుడిని ఎలా ఆరాధించాలో ఆయనకు ప్రీతికరమైనవేవో? మనం తెలుసుకుందాం.


శనిదేవుడికి చెందిన రోజు శనివారం. ఈ రోజు ఆయనకు పత్యేక పూజలు చేస్తారు. శనిదేవుడు ఈ రోజు ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి మనకు విముక్తి కల్పిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ తన భక్తుల పట్ల దయను కలిగి ఉంటాడు. సాధారణంగా శనిదేవుడు పేరు వింటేనే ప్రజలు భయపడతారు. శని కోపం తెచ్చుకోకూడదని ప్రజల మనసులో విపరీతమైన భయం ఉంటుంది. కానీ, ఆ శని భగవానుడు భక్తులపై ఎంతో దయ కలిగి ఉంటాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారు శనిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు ఉంటుంది. శనిదేవుడు దయతో పాటు ఈ నివారణలను ఒక సారి ప్రయత్నించడం ద్వారా జీవితంలో ఎప్పుడు కొరత ఉండదు.

అప్పుల బాధకు విముక్తి

రావి చెట్టుకు నీటిలో పాలతో పాటు చక్కెరను కలిపి శనివారం రోజు పోయాలి. అలాగేæ నూనె దీపాన్ని కూడా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడి దయ ఎప్పుడూ మీపై అలాగే ఉంటుంది. అదేవిధంగా మీకున్న అప్పుల నుంచి విముక్తి పొందుతారు. వైద్యం చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారు. ఆర్థికంగానూ పుంజుకుంటారు.

శనివారం రోజు కేవలం నలుపు మిరియాలనే ఉపయోగించాలి. ఆహారంలో కూడా నల్ల ఉప్పునే వాడాలి. ఈ విధంగా చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు. ఏలనినాటి శని కూడా తగ్గుతుంది.

తొలగనున్న దుష్ప్రభావాలు

రాముడి పేరును కాగితంపై రాసి, ఆ కాగితాన్ని పిండితో కలపాలి. ఆ పిండిని చిన్న గుళికలుగా చేసి
శనివారం రోజు చేపలకు తినిపిస్తే మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల శని దోషం తొలిగిపోతుంది. శని దుష్ప్రభావం కూడా పోతుంది. ఫలితంగా పురోగతికి మార్గం సుగమవుతుంది.
ఈ విధంగా చేయడం ద్వారా రుణ విముక్తి కోసం వివరించారు.

ఉపవాసం నియమాలు

శనివారం రోజు శనిదేవుడికి ఉపవాసం చేయడం ఎంతో మంచిదని అంటారు.దీనివల్ల శని ఆశీర్వాదం లభిస్తుంది. ఉపవాసం సాధ్యం కాకపోతే నల్ల మినుములతో చేసిన కిచిడిని తినాలి. దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఫలితంగా శని అనుగ్రహం పొందడమే కాకుండా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని దిగ్విజయంగా ఎదిరించే శక్తి మీకు
లభిస్తుంది.

శనివారం రోజు పేదలకు సహాయం చేయాలి. ఇలా చేయడం ద్వారా చెడు తొలిగి ఎవైనా అవంతరాలు ఉన్నా తొలుగుతాయి. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కునే శక్తిని ఆ శనిభగవాణుడు మీకు కల్పిస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news