పితృదోషాలు పోవాలంటే ఇలా చేయండి !

పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.

ఏం చేయాలి ?

ప్రతీ ఏటా వచ్చే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర , పౌత్రుల దగ్గరకు వస్తారు. కాబట్టి తప్పక పితృపక్షాలలో పెద్దలకు తర్పణాలు, పిండ శ్రాద్ధాలు పెట్టాలి ఇవి వీలుకాని వారు కనీసం బ్రాహ్మణులకు, పేదలకు, అన్నార్తులకు బియ్యం, పప్పు తదితర భోజనపదార్థాలు దానం చేయాలి. ఇలా చేయడ వల్ల అనేక రకాలైన పితృదోషాలు పోతాయి.

– శ్రీ