అక్టోబర్‌ 16 నుంచి శబరిమల పూజలు !

కేరళలోని శబరిమల శ్రీఅయ్యప్ప దేవాలయంలో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమవుతాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తారు.

శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని నడుపుతున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16న దేవస్థానాన్ని తెరుస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ దేవాలయాన్ని తెరవడం ఇదే మొదటిసారి. నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. గరిష్ఠంగా రోజుకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంది.
భక్తులు పంబకు చేరుకోవడానికి 48 గంటల ముందు పొందిన కోవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది.

– శ్రీ