తలైవా సూపర్‌స్టార్ రజనీకాంత్ కు కోడంబాక్కంలో రాఘవేంద్ర కల్యాణ్ మండపం వుంది. దీని ప్రాపర్జీ ట్యాక్స్ 6. 50 లక్షలు పెండింగ్‌గా వుందని ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని చెన్నై గ్రేటర్ మున్సిపాలిటీ రజనీకి నోటీసులు పంపించింది. లాక్‌డౌన్ కారణంగా మార్చి 24 నుంచి కల్యాణ మండపం నిరుపయోగంగా వుందని, అందు వలన ఆస్తి పన్నులో కొంత మొత్తాన్ని మాఫీ చేయాలంటే మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు రజనీ.
అయితే ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అనితా సుమంత్ హీరో రజనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాక్స్ చెల్లించాల్సింది పోయి చెన్నై గ్రేటర్ మున్సిపాలిటీ పై పిటీషన్ వేయడం ఏంటని మందలించింది. కోర్టు విలువైన సమయాన్ని దుర్వినయోగం చేశారని మండిపడింది. ఈ వివాదంపై చర్చ మొదలుకావడంతో రజనీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కల్యాణ మండపం ట్యాక్స్ విషయంలో హైకోర్టుని ఆశ్రయించి తప్పు చేశానని, అదే సమయంలో చెన్నై గ్రేటర్ మున్సిపాలిటీని ఆశ్రయించి వుంటే ఈ సమస్య తలెత్తేది కాదని ఈ అనుభవం తనకో పాఠం` అని ట్వీట్ చేశారు. రజనీ తన కల్యాణ మండపం ప్రాపర్టీ ట్యాక్స్‌ని మొత్తం చెల్లించారు.