భక్తి: అక్షయ తృతీయ విశిష్టత…!

-

హిందువులు జరుపుకునే పండగల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే దీన్ని కొన్ని ప్రాంతాలలో అఖా తేజ్ అని కూడా అంటూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారాన్ని కొంటూ ఉంటారు.

ఇది అందరికీ తెలిసినదే. తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ రోజు మనం అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి..? అసలు అక్షయ తృతీయ దేనికి సంకేతం..? అనే విషయాలు చూద్దాం.. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.

హిందువులు జరుపుకునే పండగల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. అక్షయ తృతీయ అదృష్టానికి, విజయానికి సంకేతం. ఆరోజు ఏమైనా మంచి కార్యాలని మొదలుపెడితే అదృష్టం, విజయం కలుగుతుందని హిందువుల నమ్మకం.

అక్షయ అంటే శాశ్వతమైనది, ఆనందం, విజయం అలాగే ఆనందం ఎప్పటికీ తగ్గని భావన. అదేవిధంగా తృతీయ అంటే మూడవది, అందువల్ల అని అర్థం. అయితే అక్షయ తృతీయ నాడు ఏమైనా జపాలు, యజ్ఞాలు, పితృతర్పణాలు, పుణ్య కార్యాలు వంటివి చేయడం మంచిదే. దీనివల్ల ఎప్పటికీ ఆ ప్రయోజనం పోదు అని అంటూ ఉంటారు.

ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడంటే…?

హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసం లో శుక్లపక్ష తదియ సమయంలో అక్షయ తృతీయ వస్తుంది. ఈసారి మే 14న వచ్చింది. తృతీయ తిథి 2021 మే 14 న 05:38 గంటలకు ప్రారంభమై 2021 మే 15 న 07:59 గంటల తో ముగుస్తుంది. 05:38 నుండి 12:18 వరకు పూజ చేసుకోవడానికి మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news