మాసానాం మార్గశీర్షోహం!

-

కార్తీకం ముగిసింది. అయితే అంతే పవిత్రకలిగిన మరో మాసం వచ్చేసింది. కార్తీకం శివ, కేశవులిద్దరికి ప్రీతికరమైతే మార్గశీర్షం లేదా మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికరమైనది. అసలు దక్షిణాయణంలో ప్రతి ఒక్క నెలకు ఒక్కో విశిష్టత ఉన్నది. ఒక్కదాన్ని మించి మరోకటి. అందుకే దక్షిణాయనాన్ని ఉపసాన కాలం అని కూడా అంటారు. అయితే ఎవరికి ఏ మాసంలో కుదిరితే ఆ మాసంలో లేదు అన్ని మాసాలు కుదిరితే అన్ని ఆయా రూపాల్లో ఉన్న పరమాత్మను ఉపాసనచేయడమే ప్రధానం. మార్గశిరం లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే. తొలిరోజు కార్తీకమాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలుటతో ప్రారంభమవుతుంది. ఈ మాసంలో అన్నిరోజులు శుభప్రదమైనవే.. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం.

మార్గశిర శుద్ధ తదియ నాడు *ఉమామహేశ్వర వ్రతం* చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు ‘నాగపంచమి’ చేసే ఆచారం కూడా ఉంది. మార్గశిర శుద్ధషష్ఠి సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు.

మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అంటారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి శ్రీ దత్తజయంతి. దీనినే కోర్ల పున్నమి లేదా నరక పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మార్గాశిరమాసంలో వచ్చే లక్ష్మీవారం (గురువారం) నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ‘ధనుర్మాసం’ ప్రారంభమవుతుంది. ఇక ఆలస్యమెందుకు కార్తీకంలో ఏ కారణం చేతనైనా భగవధారాధనలో లోపం లేదా చేయకుంటే ఈ మాసంలో వాటిని నిర్వహించుకుని భగవదనుగ్రహాన్ని పొందండి. డిసెంబర్‌ 26న సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఉంది. ఇదొక ఖగోళ అద్భుతం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news