దేవుడికి హారతి ఇచ్చినప్పుడు గంట కొట్టడానికి కారణం ఇదే..!

సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడు హారతి ఇస్తాం. అలా హారతిని ఇచ్చినప్పుడు గంట కొడతాం. అయితే మరి గంటని ఎందుకు కొట్టాలి..? అన్న సందేహం చాల మందికి కలుగుతుంది. మరి మీ సందేహాన్ని ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. గంటని ఎందుకు కొట్టాలి అనే విషయం లోకి వస్తే… గంటను కొట్టినప్పుడు ఓం అనే ప్రణవనాదం వెలువడుతుంది. అయితే దీని ద్వారా మన మనసు లో ఉన్న చింతలు, బాధలు తొలగిపోయి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే సాధారణంగా దేవుడికి హారతి ఇచ్చే సమయం లో ఎదురుగా మండపం లో ఉన్న గంటను కొట్టడం చేస్తారు. హారతి ఇచ్చే సమయం లో మండపం లో ఉన్న గంటను కొట్టకూడదు. ఎందుకంటే ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలోపల వింటూ ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి అని పండితులు చెబుతున్నారు.

అలానే హారతి ఇచ్చే సమయం లో అయితే మనం గంట కొట్టడం ద్వారా సమస్త దేవతలందరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడానికి. అంతే కాదు మనం గంటని కొట్టడం వల్ల మన మనసు లో ఉన్న ఇతర ఆలోచనలు తొలగి… దేవుడి పై మొత్తం ధ్యాస పెట్టడానికి సమయంలో గంట కొడతారు. అందుకే దేవుడి కి హారతి ఇచ్చేటప్పుడు గంటని కొడుతూ హారతిని ఇవ్వడం జరుగుతుంది. ఇదే దీని వెనుక ఉన్న కారణం.