విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువయి పోతున్నాయి. బయటకు వెళ్ళిన వారు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయనగరంలోని కలెక్టరేట్‌ జంక్షన్‌ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు మధ్యలో ఉన్న సర్కిల్‌ దగ్గర ఓ కారు టర్న్‌ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కారును బలంగా ఢీ కొంది.

కారు పూర్తిగా నుజ్జునుజ్జై బస్సు కిందకి వెళ్లిపోయిందంటే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. బస్సును కారు వేగంగా ఢీకొనడంతో బస్సు ముందుభాగంలో కూర్చున్న ప్రయాణికులు కూడా ఎగిరి బయటికి వచ్చి పడ్డారు. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయ పడగా బస్సులోంచి బయటికొచ్చి పడ్డ ఇద్దరికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.