సాముద్రిక శాస్త్రం ప్రకారం.. పళ్ల సంఖ్యను బట్టి వారి వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చట..!!

-

పళ్ల సంఖ్యను బట్టి కూడా వారి వ్యక్తిత్వం ఉంటుందట.. అరే అందరికి 32 పళ్లు ఉంటాయి కదా.. మళ్లీ సంఖ్యలేంటి బుర్ర ఏమైనా పాడైందా అనుకుంటున్నారా..? చిన్నప్పుడు అందరం 32 పళ్లు ఉంటాయి అని చదువుకున్నాం.. కానీ అందరికీ 32 ఉండవు తెలుసా..? చాలా తక్కువ మంది మాత్రమే 32 పళ్లను పొందుతారు.. కావాలంటే ఇప్పుడు మీకు ఎన్ని పళ్లు ఉన్నాయో ఒకసారి లెక్కేసుకోండి.. పళ్ల సంఖ్యను బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామా..!

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. దంతాల సంఖ్యను బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ఊహించవచ్చు. 32 దంతాలు ఉన్నవారు తమ జీవితకాలంలో పెరుగుతారని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ఆ వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అలాంటి వ్యక్తులు సత్యాన్ని అంగీకరించి, దానిని అనుసరించి చెడు విషయాలకు, అసత్యానికి దూరంగా ఉంటారు. నోటిలో 32 దంతాలు ఉన్నవారు తరచుగా ఏది చెప్పినా నిజమవుతుందని కూడా నమ్ముతారు. సాముద్రిక శాస్త్రంలో 31 ​​దంతాలు ఉన్నవారికి ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని, వారు చాలా తెలివైనవారుగా చెబుతోంది.

భూమిపై పుట్టిన ప్రతి వ్యక్తి నోటిలో 32 దంతాలు ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు, కొన్ని కారణాల వల్ల 32, 28, 29, 30 దంతాలకు ఉంటాయి..
కేవలం 30 దంతాలు మాత్రమే బయటకు వచ్చే వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అలాంటి వారికి ప్రత్యేక డబ్బు సమస్య ఉండదు.

నోటిలో 29 దంతాలు ఉన్నవారు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే ఉంటారట. 28 దంతాలు ఉన్న వ్యక్తులకు ఎల్లప్పుడూ కష్టాలు చుట్టుముట్టి ఉంటాయి.. అదృష్టం వారి జీవితంలో ఉండదని చెబుతోంది సాముద్రిక శాస్త్రం.

మీరు చెప్పినంతమాత్రానా ఇవి అన్ని నిజం అయిపోతాయా అని మీరు అనుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం చెబుతోందని మాత్రమే మేం చెప్తున్నాం.. నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగత అంశం.. ఇలాంటివి నమ్మాలి, నమ్ముతారు అనే యాంగిల్‌లో కంటే.. టైమ్‌పాస్‌గా అనుకోని చదివితే మంచి ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది..! ఈపాటికే కొందరు తమ పళ్లను లెక్కేసుకోని ఉండాలే..!!

Read more RELATED
Recommended to you

Latest news