Unstoppable With NBK : పవన్ ఎపిసోడ్ లో ఆ తప్పు జరగకుండా ఆహా టీమ్ అలర్ట్

-

ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్టుగా టెలికాస్ట్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ -2కి మామూలు రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ రేటింగ్స్ తో ఆహా రేంజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. కానీ ప్రభాస్ ఎపిసోడ్ కి ఆహా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి. అంతలా ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ చూడడానికి ఆసక్తి చూపించారు.

ప్రభాస్ ఎపిసోడ్ ను బీట్ చేసేలా త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ రాబోతోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోలు సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే పవర్ స్టార్ ఎపిసోడ్ లో ఎలాంటి తప్పులు జరగకుండా ఆహా టీమ్ పక్కాగా ప్లాన్ చేసినట్టు సమాచారం. గతంలో ప్రభాస్ ఎపిసోడ్ కు జరిగినట్టు.. సర్వర్ క్రాష్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ను కూడా ఏర్పాటు చేసిందట. ఒకవేళ సర్వర్ క్రాష్ అయినా.. వెంటనే పునరుద్ధరించేలా ప్లాన్ చేసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news