వాస్తు: వీటిని ఫాలో అయితే అదృష్టమే..!

పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పడం జరిగింది. వీటిని కనుక మీరు అనుసరించారు అంటే కచ్చితంగా అదృష్టం వస్తుంది. అలానే సమస్యలు కూడా ఉండకుండా మీరు ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.

మన ఇంట్లో ఉండే ప్రతి గదిలో కూడా వాస్తుని ఫాలో అవ్వాలి. అలానే బాత్రూంలో కూడా వాస్తు చిట్కాలను పాటించాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది టాయిలెట్ మరియు బాత్రూం ని అటాచ్ చేసి కట్టుకుంటున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అలా రెండిటినీ ఎటాచ్ చేసి కట్టుకోవడం మంచిది కాదు.

అలానే బాత్రూం కి పెయింట్ వేసేటప్పుడు గోడలకి తెలుపు, పింక్, లైట్ పసుపు లేదా స్కై బ్లూ కలర్ వేస్తే మంచిది. వీటి వల్ల ప్రశాంతత ఉంటుంది. అలాగే బాత్రూం లో ఉపయోగించే టైల్స్ ఎప్పుడూ కూడా లైట్ గా ఉంటేనే మంచిది. తెలుపు రంగు లేదా స్కై బ్లూ కలర్ వేస్తే మంచిది. ఇది నిజంగా బాత్ రూమ్ కి ఫ్రెష్ లుక్ ని తీసుకు వస్తుంది. నలుపు, ఎరుపు వంటి రంగులుని అస్సలు వద్దు. వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి. అలానే బాత్రూం లో ఉండే బకెట్ నీలం రంగు అయితే మంచిది. ఇలా మీరు ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే కచ్చితంగా సమస్యలు లేకుండా ఉండొచ్చు. అలానే ఏ ఇబ్బందులు అయినా తొలగిపోతాయి.