రేపట నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను జరుపనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. వాహన సేవలు ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 7 గంటకు నిర్వహిస్తామని తెలిపారు. గరుడ వాహన సేవలను రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం, మహారథం బదులుగా సర్వభూపాల వాహన సేవలను నిర్వహిస్తామన్నారు. చక్రస్నాన సేవలను ఆలయంలోని అద్దాల మహల్ లో నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం జగన్ ఈనెల 11 న పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అదే రోజు బర్డ్ హాస్పిటల్ ప్రాంగణంలో పిడియాట్రిక్ కార్డిక్ హాస్పిటల్, గోమందిరం, అలిపిరి నడక మార్గాన్ని, 12 వ తేదీన యస్వీబీసీ కన్నడ ఛానెల్ ను సీఎం ప్రారంభిస్తారన్నారు. కన్నడ ఛానెల్ ప్రారంభోత్సవంలో కన్నడ సీఎం బొమ్మై పాల్గొననున్నట్లు వెల్లడించారు. 13 జిల్లాల్లో వెనుకబడిన తరగతికి చెందిన భక్తులకు ఉచితంగా దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. టీటీడీ వాహనాలను ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తరలిస్తామని తెలిపారు.
రేపటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
-