జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బీ నిర్లక్ష్యానికి మరో యువకుడు బలయ్యాడు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ లో విషాదం చోటుచేసుకుంది. రామ్ చరణ్ ఆయిల్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ నుంచి కింద పడిన యువకుడిపై నుంచి కంటైనర్ వెల్లడంతో అక్కడిక్కడే మరణించాడు. ఘటన స్థలంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
మ్రుతుడు శ్రీరాం కాలనీకి చెందిన శివగా గుర్తించారు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు ట్రాపిక్ జామ్ ను క్లియర్ చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మ్రుతుడు శివకు 9 నెలల కిందే వివాహం జరిగింది. రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరణించిన శివను చూసి కన్నతల్లి గుండెలు బాదుకుంటూ దు:ఖించడం పలువురిని కంటతడి పెట్టించింది. జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.