వాస్తు: తుడిచేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి..!

-

వాస్తు ప్రకారం ఫాలో అయితే సమస్యలేమీ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అయితే పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెబుతున్నారు. ఈ చిట్కాలను కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. మనం ఇల్లు తుడవడానికి చీపురుకట్టను ఉపయోగిస్తాము. చీపురుకట్ట తో ఈ తప్పులు చేయకూడదు. అలాగే ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది.

చీపురుకట్టతో కనుక తప్పులు చేశారంటే లక్ష్మీదేవి కి కోపం వచ్చి.. ఇంట్లోకి రాదు. కాబట్టి ఎప్పుడూ కూడా చీపురికట్టతో తుడిచారంటే ఇలాంటి తప్పులను చేయొద్దు. పురాణాల ప్రకారం చీకటి పడ్డాక ఇల్లు తుడవకూడదు. అలా తుడవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అలానే ఎవరైనా బయటకు వెళ్లిన వెంటనే కూడా తుడవకూడదు.

వెళ్ళిన ఒక గంట లేదా రెండు గంటల తర్వాత కూడా తుడుచుకోచ్చు. అలాగే చీపురుకట్టని గౌరవించాలి. తన్నడం లాంటివి చేయకూడదు. అలానే చీపురు కట్ట తో ఎప్పుడు తుడిచినా తర్వాత తిరిగి దాని ప్రదేశంలో పెట్టేయాలి లేదు అంటే నెగిటివ్ ప్రభావం పడుతుంది. చీపురుకట్ట ఇంటి బయట పెట్టకూడదు మరియు మేడ మీద కూడా పెట్టడం మంచిది కాదు.

అదే విధంగా వాస్తు ప్రకారం ఎప్పుడూ చీపురుకట్టని దాచేయాలి. అందరికీ కనిపించేటట్టు ఉంచకూడదు. అలానే ఇంట్లో ఉండే చిన్న వాళ్ళు తుడిస్తే చాలా మంచిది. ఇంట్లో ఉండే చిన్న పిల్లల తుడిస్తే శుభం కలుగుతుంది. అలానే ఇల్లు మారేటప్పుడు చాలామంది వాడే చీపురుకట్టని పట్టుకు వెళ్తారు. కొత్త ఇంటికి వెళ్తున్నారంటే వాడేసిన చీపురుకట్టని పట్టుకెళ్ళద్దు. అలానే కలలో కనుక చీపురుకట్ట కనిపించిందంటే అదృష్టానికి సంకేతము.

Read more RELATED
Recommended to you

Latest news