గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికోడుతున్నాయి. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలు వర్షాలకు తడిసిముద్దవుతున్నాయి. రోడ్లుపై వర్షపు నీరు చేరి నదీప్రవాహాలను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా జనాలు ఇళ్లకే పరిమితం కావాల్సివస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతోంది. రానున్న మరో రెండు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో 28,29 తేదీల్లో జరిగే పలు డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదావేస్తున్నట్లు విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా అటు ఏపీలో నిర్వహించాల్సిన పరీక్షలను కూడా అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. తాజగా తెలంగాణ ప్రభుత్వం కూడా పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
-