ఈ రాశుల వాళ్ళు చిన్న విషయానికి కూడా భయపడతారు..!

సాధారణంగా కొందరు చాలా ధైర్యంగా ఉంటే మరికొందరు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అయితే నిజంగా ఇలా బయట పడడం అనేది ఒక సమస్య. రాశుల ఆధారంగా ఏ రాశుల వాళ్ళు ఎక్కువ భయపడతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

 

fear

కన్యా రాశి:

ఈ రాశి వాళ్లు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. పైగా వీళ్లలో ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. కానీ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువగా ఉంటుంది. అలానే వాళ్ళ పై వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు. ఇలా ఈ విధంగా వాళ్ళు భయపడుతూ ఉంటారు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వాళ్లు ఎంతో సెన్సిటివ్ గా ఉంటారు. అదే విధంగా వాళ్ల పై వాళ్ళకి నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు కాస్త కేరింగ్ గా ఉన్నప్పటికీ కూడా భయపడుతూ ఉంటారు.

తులా రాశి:

తులారాశి వాళ్ళకి కూడా బాగా భయం ఉంటుంది. సాధారణంగా వీళ్లకి సిగ్గు ఎక్కువ. అలాగే ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ల గురించి ఇతరులు ఏమనుకుంటారో అని వీళ్లు ఎక్కువగా భయపడిపోతుంటారు.

మీన రాశి:

వాళ్ల గురించి వాళ్లు అసలు ఏమాత్రం ఆలోచించుకోరు ఎవరైనా ఏదైనా చెబితే కూడా వెంటనే చేస్తారు. వాళ్ళకి చెయ్యను అని చెప్పడం తెలియదు. ఎక్కువ వీళ్ళు ఇతరులపై ఆధారపడి ఉంటారు. నిర్ణయాలు కూడా తీసుకోలేరు. వీళ్ళు ఎంత క్లియర్ గా ఉన్నప్పటికీ భయపడుతూ ఉంటారు.

మకర రాశి :

మకర రాశి వాళ్ళు వారి యొక్క ఫీలింగ్స్ ని ఈజీగా దాచేస్తారు. ఇలా వాళ్ళ ఫీలింగ్స్ ని దాచుకోవడం వల్ల ఎక్కువగా భయపడుతూ ఉంటారు.