సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంట నూనె ధరలు.. ఎంతశాతం తగ్గాయంటే?

గత కొన్ని రోజులుగా వంటనూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో నూనెల ధరలు చేరుకున్నాయి. ఒక్కసారిగా 70శాతానికి పైగా ధరలు పెరగడంతో సామాన్యుల ఇళ్ళలో పొయ్యి వెలగడం కష్టంగా మారింది. ఐతే ప్రస్తుతం వంటనూనెల ధరలు దిగి వస్తున్నాయి. దిగుమతి పన్ను తగ్గించడంతో కిలో ఆయిల్ ప్యాకెట్ పై సుమారుగా 15నుండి 20శాతం ధరలు తగ్గనున్నట్లు తెలుస్తుంది. ముడి పామాయిల్ పై ఉన్న 10శాతం దిగుమతి సుంకాన్ని 2.5శాతానికి తగ్గించాయి. అలాగే సన్ ఫ్లవర్, సోయా మొదలగు వాటిపై ఉన్న 7.5శాతం దిగుమతి సుంకం 2.5వరకు తగ్గింది.

కరోనా కారణంతో పాటు ఇండియాలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం కూడా వంట నూనె ధరల పెరుగుదలకి కారణంగా ఉంది. ఏదేమైనా ప్రస్తుతం నూనె ధరలు తగ్గాయి. ఈ విషయం సామాన్యులకి బాగా ఊరట కలిగించేదే.