ఈ రోజున జుట్టు కట్ చేసుకుంటే సమస్యలు తప్పవు..!

సాధారణంగా చాలా మంది పురుషులు ఆదివారం సెలవు కారణంగా షేవింగ్ చేసుకోవడం, జుట్టుని కట్ చేయించడం చేస్తారు. అయితే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి రోజు. ఆదివారం నాడు జుట్టు కట్ చేసుకోవడం వల్ల ధననష్టం కలుగుతుంది. అయితే ఆదివారం హెయిర్ కట్ చేసుకోకపోతే మరి ఎప్పుడు చేసుకోవాలి…?, ఎప్పుడు చేసుకోవడం మంచిది కాదు అనేది చూస్తే..

 

hair-cut

సోమవారం:

సోమవారం నాడు జుట్టుని కట్ చేసుకోకూడదు. ఆ రోజు కనుక కట్ చేసారు అంటే కచ్చితంగా ప్రశాంతంగా ఉండలేరు. ఇబ్బందులు కూడా వస్తాయి.

మంగళవారం:

మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవాలి అనుకుంటే అస్సలు మంచిది కాదు ఇది కూడా నిజంగా జీవితానికి ప్రమాదం.

బుధవారం:

బుధవారం హెయిర్ కట్ చేసుకోవడానికి.. షేవ్ చేసుకోవడానికి మంచిది. గోర్లు కూడా బుధవారం నాడు కట్టించుకోవచ్చు. ఈరోజు హెయిర్ కట్ చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు. అదే విధంగా ధనం కూడా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు.

గురువారం:

గురువారం కూడా హెయిర్ కట్ చేసుకోవడానికి మంచిది కాదు. గురువారం నాడు ఇది చేశారంటే కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. గౌరవానికి కూడా భంగం కలుగుతుంది.

శుక్రవారం:

శుక్రవారం కట్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఇలా చేయడం వల్ల ధన నష్టం కలగదు. కానీ చాలా మంది ఇళ్లల్లో శుక్రవారం ఈ పనులు చెయ్యడని అంటారు.

శనివారం:

శనివారం కూడా హెయిర్ కట్ చేయడం, గోర్లు కట్ చెయ్యడం మంచిది కారు. ఈరోజు కనుక ఈ పనులు చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి శనివారం కూడా కట్ చేసుకోవద్దు.