మంచంపై ఈ వస్తువులు పెడితే ఇక దరిద్రం వెంటాడుతూనే ఉంటుందట..!

ఇంటికి సంబంధించిన వరకూ అన్ని వాస్తు ప్రకారమే ఉండాలి. లేకుంటే లక్షలు పోసి ఇల్లుకట్టినా అనందంగా ఉండలేరు. చాలామంది కొత్త ఇంట్లోకి వచ్చాక ఏమైనా చెడుగా జరిగినా, ఆరోగ్య సమస్యలు ఎదురైనా మంచి వాస్తునిపుడినే పిలిపిస్తారు. ఇంట్లో ఏది ఏ మూల ఉండాలి, ఎలా ఉండాలి అని ప్రతీదానికి ఓ లెక్కు ఉంటుంది. ప్రతీది పట్టించుకోలేము. కొన్నింటిని మాత్రమే ఏదో వాస్తుప్రకారం సెట్ చేస్తుంటాం. మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల నెగిటివి ఎనర్జీతోపాటు, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి

వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించడం మన సనాతన ధర్మం. ముఖ్యంగా పడకగది, హాలు, కిచెన్‌ ఏ దిశలో ఉండాలో ఆ దిశగానే ఏర్పాటు చేసుకుంటాం. పొరపాటున కూడా తెలిసి కాని, తెలియక కాని కొన్ని వస్తువులు బెడ్‌రూం లోని మంచంపై పెట్టకూడదు. దీనివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. దీంతో దరిద్య్రం మనల్ని వెంటాడుతుంది. అలావాటు లోనో పొరపాటు కావచ్చు బెడ్‌ సౌకర్యవంతంగా ఉంటుందని దానిపై ఏవేవో వస్తువులు పెడతాం. అలా పెట్టడం వల్లే ధనలక్ష్మి అమ్మవారికి కోపం కలిగేది.

ఏయే వస్తువులు మంచంపై పెట్టకూడదటే:

ముఖ్యంగా ఆభరణాలు అయిన ముత్యాలు, గవ్వలు ఎప్పుడూ మంచం మీద పెట్టవద్దు. ఇంకా సాలగ్రామాలు, రుద్రాక్షలు, బంగారు, వెండి ఆభరణాలు, వజ్రాలతో చేసిన ఆర్నమెంట్స్, పచ్చల్ని కూడా పడుకునే మంచం మీద పెట్టరాదు.

బెడ్‌రూంలో బీరువా తెరవగానే పొరపాటును కిందపడతాయనో, ఇంకోటి అనుకునో తీసుకువచ్చి బెడ్‌మీద పెడతారు. ఇలా చేయడం వల్ల లక్షీక్షయం అవుతుంది.

అస్సలు శాస్త్రం ప్రకారం బంగారానికి ఉన్న లక్షణం తమ తోటి బంగారాన్ని తమతో రమ్మని పిలుస్తుందట. దీంతో మీ ఇంటికి మరింత బంగారం వచ్చి చేరుతుందని అర్థం. అయితే, ఇలా మంచం మీద బంగారం పెట్టడం వల్ల కొత్త బంగారాన్ని పిలవకపోగా.. ఉన్నవి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. వింటగా విచిత్రంగా ఉన్న శాస్త్రం ఇదే చెబుతుంది.

అందుకే కొంతమందికి ఎంత బంగారం ఉన్నా.. అది ఎప్పుడూ బ్యాంకులు లేదా తనఖా షాపుల్లో మగ్గిపోతుంటాయి. దానికి ప్రధాన కారణం.. మంచం మీద ఇలా ఆభరణాలు పెట్టడమే. ఇంకా మంచం మీద కూర్చుని కొంత మంది భోజనం చేస్తారు. అది ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది. ఇలా ఎప్పుడూ చేయకూడదు.

– Triveni Buskarowthu